సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు సంఘటితంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు వెల్లడించారు. అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధ పడాలని సూచించారు. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో జర్నలిస్టుల ఆత్మీయ ఆదివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.
సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జర్నలిస్టులకు పింఛను సదుపాయంతో పాటు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను సమావేశం ఖండించింది.
ఇవీ చూడండి: 'అప్పుడు ఎగతాళి చేసినోళ్లే.. ఇప్పుడు మెచ్చుకుంటున్నరు'