ETV Bharat / state

ఫోర్బ్స్‌ జాబితాలో హైదరాబాదీ కుర్రాడు - Forbes list 2022

హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ‘ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌’గా జొన్నలగడ్డ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను తిరగరాశారు.

Jonnelagadda Nilakanta Bhanu Prakash has made it to the Forbes list
ఫోర్బ్స్‌ జాబితాలో హైదరాబాదీ కుర్రాడు
author img

By

Published : May 27, 2022, 9:03 AM IST

కరోనా తొలినాళ్ల నుంచి ఆసియా-పసిఫిక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్రాంత యువత మాత్రం కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే సొంత వ్యాపారాలను పెట్టి, సవాళ్లను ఎదుర్కొని మరీ గెలిచి చూపించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘30 అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితా ఆ విషయాన్నే వెల్లడిస్తోంది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్‌ నిర్వచిస్తున్నట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. ‘ఈ జాబితా కోసం 4,000కు పైగా నామినేషన్లు ఈ ఏడాది వచ్చాయి. చివరకు ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేశాం. ఒలింపిక్స్‌లో విజేతల నుంచి అంకురాల వ్యవస్థాపకుల వరకు ఇందులో చోటు చేసుకున్నార’ని ఫోర్బ్స్‌ తెలిపింది.

భారతే నంబర్‌ వన్‌: తుది జాబితాలో మొత్తం 22 దేశాల వారు చోటు దక్కించుకోగా.. అందులో 61 మందితో భారత్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న సింగపూర్‌(34), జపాన్‌(33), ఆస్ట్రేలియా(32), ఇండోనేషియా(30), చైనా(28)లకు, భారత్‌ మధ్య అంతరం చాలా కనిపించింది. ఆగ్నేయాసియా నుంచి 90 మంది చోటు దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అంకుర వ్యవస్థ బాగా ఎదుగుతోంది. అంతర్జాతీయ వెంచర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సింగపూర్‌కు ఇతర ప్రాంతాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలూ చేరుతున్నారు. ఇండోనేషియా అంకురాల్లోకి 2021 తొలి 6 నెలల్లో 4.7 బి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

‘లెక్క’ తప్పని విజయం: హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో భాన్జు అనే కమర్షియల్‌ ఎడ్‌టెక్‌ అంకురాన్ని ఈ యువకుడు ప్రారంభించారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ‘భాన్జు’ పద్ధతిలో అభ్యసిస్తే, విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని భాను చెబుతుంటారు. 2021 జులైలో భానుకు చెందిన అంకురానికి లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ నుంచి 2 మి. డాలర్ల సీడ్‌ ఫండింగ్‌ అందింది. ఇప్పటికే ఈ అంకురం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపిందని ఆయన అంటారు. 17 ఏళ్ల వయసులో ‘ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌’గా జొన్నలగడ్డ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను తిరగరాశారు.

ఇవీ విభాగాలు

  • ఫోర్బ్స్‌ జాబితాలోని యువత
  • కళలు
  • వినియోగదారు సాంకేతికత
  • ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ
  • ఆరోగ్య సంరక్షణ-శాస్త్రవిజ్ఞానం
  • వినోదం-ఆటలు
  • పరిశ్రమ-తయారీ-ఇంధనం
  • మీడియా-మార్కెటింగ్‌-ప్రకటనలు
  • సామాజిక ప్రభావం
  • రిటైల్‌-కామర్స్‌
  • ఫైనాన్స్‌- వెంచర్‌ క్యాపిటల్‌ విభాగాల్లో కనిపించారు.

ఇవీ చదవండి:రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.