ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు, ఐకాస నాయకుల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్ లైన్ పెట్టినా హక్కుల కోసం సమ్మెను కొనసాగిస్తూ.. ధైర్యాన్ని చాటారని కొనియాడారు. పోలీసులతో కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నా.. ఎక్కడా భయపడలేదని, హక్కుల సాధనకు రెట్టింపు పట్టుదలతో నిలబడ్డారని అభినందించారు.
ఆర్టీసీ కార్మికులవి చాలీచాలని జీతాలతో... ఇబ్బంది పడే జీవితాలని... అలాంటి వారు రిటైర్డ్ అయ్యాక వైద్యానికీ డబ్బులు లేని దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికైనా బిడ్డల్లాంటి ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ