ETV Bharat / state

ఉపాధి అవకాశాలకు అడ్డా హైదరాబాద్​: సీపీ అంజనీకుమార్​

ఉపాధి అవకాశాలు రోజురోజుకు నగరంలో పెరుగుతున్నాయని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. సిటీ కమిషనరేట్​ ఆధ్వర్యంలో ఆసీఫ్​నగర్​లో నిర్వహించిన జాబ్​మేళాకు మంచి స్పందన లభించింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సీపీ సూచించారు.

JOB MELA CONDUCTED IN HYDERABAD UNDER CITY POLICE COMMISSIONERATE
author img

By

Published : Oct 26, 2019, 4:45 PM IST

పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్​ ప్రసిద్ధి చెందుతోందని... ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తనున్నాయని నగర సీపీ అంజనీకుమార్​ పేర్కొన్నారు. ఆసీఫ్​నగర్​లో సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి 450 మంది నిరుద్యోగ యువత హాజరైనట్లు సీపీ తెలిపారు. ఇలాంటి జాబ్​మేళాను వినియోగించుకుని యువత ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. ఈ జాబ్​మేళాలో మొత్తం 31 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజన్​కుమార్​తో పాటు డీసీపీ సుమతి, ఆసీఫ్​నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు.

సీటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

ఇవీ చూడండి: "శ్రీరామ" సోయగం: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేత

Intro:పోలీస్ జాబ్ మేళా

Body:పోలీస్ జాబ్ మేళా

Conclusion:హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు...
ఈ జాబ్ మేళా కు 450 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా యువతీయువకులకు ఎంతో ఉపయోగపడుతుందని దీన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాలని సిటీ కమిషనర్ తెలిపారు. ఈ జాబ్ మేళా లో మొత్తం 31 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారికి అపాయింట్మెంట్ లెటర్ లు అందజేశారు .ఈ కార్యక్రమంలో సిపి అంజన్ కుమార్ తో పాటు డిసిపి సుమతి మరియు ఆసిఫ్ నగర్ ఏసిపి నంద్యాల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బైట్: అంజనీకుమార్( హైదరాబాద్ సీపీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.