తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బోరబండలో తెరాస నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ మేరకు గురువారం స్థానిక డివిజన్ కార్యాలయంలో బోరబండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు చేశారు.
మహావ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేందుకు కృషి చేసిన మహావ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కృష్ణమోహన్ కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడేందుకు ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.