నాలుగున్నర కోట్ల లావాదేవి విషయంలో జయరాం హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. వాట్సప్‌లో మహిళ పేరుతో చాటింగ్ చేసి జయరాంను మభ్యపెట్టి రప్పించారని పోలీసులు భావిస్తున్నారు. చివరికి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి జయరాంను తీసుకెళ్లి డబ్బుల గురించి గట్టిగా నిలదీశారు. కేవలం ఆరు లక్షలు ఇచ్చినట్లు రాకేశ్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
జయరాం మృతిని ప్రమాదంగా చిత్రీకరించడానికి రాకేశ్‌రెడ్డి ప్రణాళిక రచించాడు.స్నేహితులతో కలిసి కారులో మృతదేహాన్ని విజయవాడ వైపు తీసుకెళ్లాడు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లుండడంతో ప్రాథమిక విచారణ చేసిన ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేశారు. ఏసీపీపై మరింత లోతుగా విచారించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కుక్కలు చంపడానికి ఉపయోగించే విషం వాడినట్లు మొదట భావించినప్పటికీ...అలాంటిదేమి లేదని దర్యాప్తులో తేల్చారు. శరీరం నల్లగా మారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు
మెదక్‌లో జయరాంకు చెందిన పరిశ్రమలో శిఖా నిర్వహణపరమైన వ్యవహారాలు చూసుకునేది. కార్మికుల తరఫున ఆ కంపెనీకి వెళ్లిన రాకేశ్, శిఖాతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటినుంటి తన మకాంను జూబ్లిహిల్స్‌కు మార్చి ఇంటికి వచ్చేవాడుకాదని అతని తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శిఖాచౌదరి తన కుమారుడిని తప్పుదారి పట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.