దిశ నిందితులకు సరైన శిక్ష పడిందని యావత్ దేశం గర్విస్తుందన్నారు.. కానీ మహిళలకు రక్షణ లేకుండ ఉందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. దేశంలో వంద కేసుల్లో పది కేేసులకు కూడా శిక్ష పడటంలేదని... వాటికి సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో తొంభై శాతం నిందితులకు శిక్ష పడుతుందని వాటికి సరైన సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్ రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను నియంత్రించడాని పకడ్బందీ చట్టాలను తీసుకురావాలన్నారు.
ఇదీ చూడండ: యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు