ETV Bharat / state

నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాలి: నాగబాబు

Nagababu Met Janasena Party Activists : ఏపీలో ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వ పాలన సాగుతోందని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. దీనిని ఎదుర్కోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి ఉందని తెలిపారు. అనంతపురంలో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాలి: నాగబాబు
నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాలి: నాగబాబు
author img

By

Published : Jan 22, 2023, 10:52 PM IST

Nagababu Met Janasena Party Activists : ఆంధ్రప్రదేశ్​లో సాగుతున్న నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి ఉందని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. అనంతపురంలో ఆయన వీర మహిళలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎక్కువ శాతం వలసలు ఉన్నాయని, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బెదిరింపులతో.. రాజకీయ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాగబాబు ఆరోపించారు. జనసేన కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క రైతుకూ న్యాయం చేయలేదన్నారు. ఇలాంటి నాయకులను విమర్శించడం కంటే.. ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు.

"బెదిరింపులతో.. నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం నడుస్తోంది. దీనికి వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమవ్వాలి. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి హింసిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు". - నాగబాబు, జనసేన నేత

ఇవీ చదవండి:

'పాలమూరు గడ్డ.. పేదోడి అడ్డా.. దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'

సొంతకాళ్లపై నిలబడుతున్న ట్రాన్స్​జెండర్లు.. స్పెషల్​గా హోటల్ పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.