ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నేత పార్వతి నాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హబ్సిగుడాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందుపడకూడదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సేవలు అందించామని ఆమె తెలిపారు.
కొవిడ్ కష్టకాలంలో పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ద్వారా 80 కోట్ల మందికి నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలు అందించారన్నారు. అదే విధంగా రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు వేసి ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు.