ETV Bharat / state

'కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకే ప్రచారం ఉద్యమం'

ప్రజల్లో కుటుంబవ్యవస్థ పట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు పదిరోజులు ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని జమాతె ఇస్లామీహింద్ తెలంగాణ అధ్యక్షురాలు మౌలానా హామిద్ తెలిపారు. పటిష్ఠ కుటుంబం- పటిష్ఠ సమాజం నినాదంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

author img

By

Published : Feb 18, 2021, 1:27 PM IST

jamaat e islami hindu telangana president on family relations
'కుటుంబవ్యవస్థను పటిష్ఠం చేసేందుకే ప్రచారం ఉద్యమం'

ప్రస్తుత సామాజిక పరిస్థితులలో కుటుంబ వ్యవస్థ కుంటుపడిందని, కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని జమాతె ఇస్లామీహింద్ తెలంగాణ అధ్యక్షురాలు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. బలహీనమవుతున్న కుటుంబవ్యవస్థను పటిష్ఠం చేసుకునేందుకు పది రోజుల ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

వివాహ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇంట్లో వయోవృద్ధుల హక్కులను కాపాడటం, కుటుంబ విలువలపట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పటిష్ఠ కుటుంబం-పటిష్ఠ సమాజం నినాదంతో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్నర్‌ మీటింగులు, ఫ్యామిలీ క్విజ్ పోటీలు, వివిధ మత పండితులతో చర్చా గోష్ఠులు, వెబినార్లు, కుటుంబ సర్వేలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సీజే శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.