గ్రేటర్ హైదరాబాద్‌లో సంపూర్ణ స్వచ్ఛతకు చేపట్టిన 'సాఫ్ హైదరాబాద్- షాందార్ హైదరాబాద్', జల సంరక్షణకై చేపట్టిన వాక్ కార్యక్రమాలను కేంద్ర జలశక్తి అభియాన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ అభినందించారు. దిల్లీలో సస్టేనేబుల్ సానీటేషన్ అంశంపై జరుగుతున్న జాతీయ స్థాయి కార్యశాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌లో 'సాఫ్ హైదరాబాద్- షాందార్ హైదరాబాద్', జల సంరక్షణకై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రత్యేక స్టాల్లను ఏర్పాటు చేశారు. జలశక్తి అభియన్ కార్యదర్శిని కలిసిన దానకిషోర్ హైదరాబాద్‌లో స్వచ్ఛత, జల సంరక్షణ, సీవరేజ్ కోసం చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం జలశక్తి అభియాన్ ప్రమాణాలను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయని అయ్యర్ ప్రశంసించారు. సోమవారం జరగనున్న కార్యక్రమంలో ఈ మూడు అంశాలపై పూర్తిస్థాయి నివేదికను కమిషనర్ దాన కిషోర్ ప్రదర్శించనున్నారు.
ఇవీ చూడండి: తండ్రీకొడుకుల పార్టీకి స్వస్తి పలికితేనే అభివృద్ధి