ఇంటర్మీడియట్ బోర్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బదిలీలు చేస్తూ...వారి జీవితంలో చెలగాటం ఆడుతున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ శాఖలో అగ్రకులాలకు ఒక న్యాయం... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు మరోరకమైన న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ అధికారులు వారం రోజుల్లో తమ పద్ధతిని మార్చుకోకపోతే బోర్డు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు.. ఒక్కొక్కటిగా...