ETV Bharat / state

వైకాపా నేతల తీరు సరికాదు... అది సమాజానికి తప్పుడు సంకేతం: జగ్గారెడ్డి - తెలంగాణ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga reddy React on chandrababu crying Incident) ఖండించారు. అసెంబ్లీలో ఏపీ జగన్ మోహన్ రెడ్డి బృందం ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. అది సమాజానికి తప్పుడు సంకేతం పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి... కానీ చంద్రబాబుకి వయసు రీత్యా అయినా.. గౌరవం ఇవ్వాల్సిందని పేర్కొన్నారు.

Jagga reddy React on chandrababu crying Incident
Jagga Reddy
author img

By

Published : Nov 20, 2021, 7:27 PM IST

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga reddy React on chandrababu issue) ఖండించారు. చంద్రబాబును రాజకీయంగా లక్ష్యం చేయకుండా... కుటుంబాన్ని దూషించడం వల్లే ఏడ్చారని అన్నారు. కుటుంబ సభ్యులపై విమర్శలు వస్తే... ఎవరైనా బాధపడతారని పేర్కొన్నారు. జగన్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు మీద విమర్శలు చేయడం చూశానని అన్నారు. వైకాపా నేతలు ప్రవర్తించిన తీరు సరికాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సాధారణం... కానీ మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని తెలిపారు. అది సమాజానికి తప్పుడు సంకేతం పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీతో తనకు అనుబంధం ఉన్నందునే మాట్లాడుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

ఇవాళ నాని మాటలకు చప్పట్లు కొట్టొచ్చు కానీ...

చంద్రబాబుపై నాని మాట్లాడిన మాటలు సరి కాదని జగ్గారెడ్డి (Jagga Reddy latest news) అన్నారు. ఆయన అనేక సార్లు... దుర్భాషలు ఆడారని ఆరోపించారు. ఇవాళ నాని మాటలకు చప్పట్లు కొట్టొచ్చు కానీ... అది మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబును వైఎస్ ఓసారి ఒక మాట అంటే... రికార్డ్ నుంచి తొలగించాలని స్వయంగా వైఎస్ చెప్పారని గుర్తు చేశారు.

వయసు రీత్యా అయినా.. గౌరవం ఇవ్వాల్సింది...

రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి... కానీ చంద్రబాబుకు వయసు రీత్యా అయినా గౌరవం ఇవ్వాల్సిందని జగ్గారెడ్డి (Jagga reddy React on chandrababu issue) పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కావని తెలిపారు. స్పీకర్ కుర్చీ సీఎం ఇచ్చినా... ప్రతిపక్ష నాయకుడి కుటుంబంపై దూషణలు చేస్తుంటే చూస్తూ ఉండటానికి కాదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

హుందాతనం అంటే అది...

పేర్ని నాని (perni nani) బాబుపై ఎన్నో విమర్శలు చేసారని... కానీ అతను పాలసీలపై మాత్రమే మాట్లాడేవారని జగ్గారెడ్డి అన్నారు. అలాగే తెలంగాణలో తమ గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారని.. కానీ వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయలేదని పేర్కొన్నారు. హుందాతనం అంటే అలా ఉండాలని తెలిపారు. మంత్రి కొడాలి నాని (Jagga reddy fire on kodali nani), అనిల్ కుమార్, రోజా(MLA Roja) ప్రవర్తించిన తీరు సరికాదని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని లేకపోతే పగలు పెరిగి పోతాయని తెలిపారు.

ఇదీ చదవండి: ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది: జూ. ఎన్టీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.