హైదరాబాద్ జగద్గిరిగుట్ట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 11న ఆర్పీకాలనీలో వెంటాడి ఓ వ్యక్తిని హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంజారాహిల్స్‌కు చెందిన ఫయాజ్ ఖాన్... డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్ట ఆర్పీ కాలనీకి చెందిన మహిళతో ఫయాజ్ఖాన్కు పరిచయం ఏర్పడింది. మహిళను కలిసేందుకు ఫయాజ్ తరుచూ జగద్గిరిగుట్టకు వచ్చేవాడు.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, సాయి, నరేశ్, శివ అనే నలుగురితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య తరుచూ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతుండేవి. ప్రశాంత్ రెడ్డిపై 2018లో రాయదుర్గం ఠాణాలో ఓ కేసు నమోదు అవగా... పోలీసులకు తప్పించుకుని తిరుగుతుండేవాడు. ఈ విషయం తెలిసి.. 2019లో ప్రశాంత్‌రెడ్డిని ఫయాజ్ పోలీసులకు పట్టించాడు.
తనను పట్టించాడన్న కోపంతో లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన ప్రశాంత్‌రెడ్డి.... ముగ్గురు స్నేహితులతో కలిసి 11న ఫయాజ్‌ఖాన్‌ను కత్తులు, బండరాయితో హత్యచేశారు. కేసును చేధించిన పోలీసులు... నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల దగ్గరి నుంచి మూడు చరవాణులు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు