కుత్బుల్లాపూర్ ప్రగతినగర్‌లో చిరుత సంచారం చేస్తుందనే వదంతులపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. హుటాహుటినా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. చిరుత సంచారం జాడలు లేవని తేల్చారు. గీతాంజలి పాఠశాలలోకి చొరబడిందనేది అవాస్తవమని... ఎవరో కావాలనే వదంతులు పుట్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తలు నమ్మి.. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచించారు.
ఇవీ చూడండి: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి