హైదరాబాద్‌లోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు గురువారం కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 ఐటీ బృందాలు పాల్గొన్న ఈ సోదాల్లో హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, కలకత్తా, తదితర ప్రాంతాల ఐటీ అధికారులు ఉన్నారు. ఎంఎస్ఎన్ కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థలు, ఆ కంపెనీకి రసాయనాలు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేసే సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
సనత్ నగర్, బొల్లారంలోని ఎంఎస్ఎన్ కార్యాలయాలు, ఆ సంస్థ యాజమానితో పాటు దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో.. సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు వివరించారు. ఎంఎస్ఎన్ వ్యాపారలావాదేవీలకు, ఆదాయపు పన్ను చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉండటంతో దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన పాత్రలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
సంబంధిత వార్త: ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు
ఇదీ చదవండి: అవినీతికి అడ్డాగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్..!