ETV Bharat / state

KTR ON IT: గతేడాది లక్షన్నర ఐటీ ఉద్యోగాలు వచ్చాయి: కేటీఆర్‌

KTR ON IT: హైదరాబాద్‌లో గత 8 ఏళ్లలో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా కాలంలోనూ ఐటీ పరిశ్రమ వృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదిక విడుదల చేశారు.

KTR ON IT
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
author img

By

Published : Jun 1, 2022, 12:21 PM IST

Updated : Jun 1, 2022, 3:39 PM IST

KTR ON IT: రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గతేడాదిలోనే లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.

ఐటీలో 8 ఏళ్లుగా తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామని తెలిపారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ సాధించామని వెల్లడించారు. గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు.

ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించాం: కేటీఆర్‌

ఐటీలో 8 ఏళ్లుగా అద్భుతమైన పురోగతి సాధించాం. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించాం. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి సాధించాం. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ సాధించాం. హైదరాబాద్‌లో 8 ఏళ్లుగా ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయి. - కేటీఆర్, ఐటీశాఖ మంత్రి

వన్‌ ప్లస్‌ కంపెనీ హైదరాబాద్‌లో టీవీలు తయారుచేస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని తెలిపారు. ఈ నెల 20న టీహబ్ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్​లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని... తెలంగాణ, హైదరాబాద్​ను గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్ వివరించారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్​కు కూడా ఉత్తమ గమ్యస్థానం లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఫేసియల్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గురించి చెబితే ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో చాలామంది ఆశ్చర్యపోయారని మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: యాక్సిస్‌ బ్యాంక్‌కు షాక్‌ ఇచ్చిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ

నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. అంతెత్తున గాల్లోకి ఎగిరిపడి..!

Last Updated : Jun 1, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.