ETV Bharat / state

KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం: కేటీఆర్​ - కేటీఆర్​ తాజా వార్తలు

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ వీహబ్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జైయేశ్‌ రంజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ktr
కేటీఆర్​
author img

By

Published : Jul 28, 2021, 3:10 PM IST

Updated : Jul 28, 2021, 3:36 PM IST

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. అందులోనూ మహిళా పారిశ్రామిక వేత్తలను తమ ప్రభుత్వం వెన్నంటి ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వీహబ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు స్టార్టప్​లతో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్​ అయ్యారు. వీహబ్ నుంచి మెంటర్షిప్ పొంది గ్రాడ్యుయేటింగ్ పూర్తిచేసుకున్న 47 స్టార్టప్​లకు కేటీఆర్ అభినందనలు తెలియజేయటమే కాక, వారి వ్యాపార ఆలోచనలకు ప్రభుత్వం తరుఫున సహకారం అందిస్తామన్నారు.

సమకాలీన సమస్యలు, సవాళ్లకు పలు స్టార్టప్​ల ఆలోచనలు, పరిష్కారాలు తననెంతో అబ్బురపరిచాయన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తలు పంచుకున్న కొన్ని ఐడియాలు, ఉత్పత్తులు, ప్రపంచ గతి, స్థితిని మార్చేలా ఉన్నాయని.. ఇన్నోవేషన్ ద్వారా మన దేశానికే కాకుండా.. గ్లోబల్​గా దశదిశ సూచిస్తుందని కేటీఆర్ అన్నారు. ఉత్తమ ప్రొడక్టుతో మా వద్దకు వస్తే.. తెలంగాణ ప్రభుత్వమే మీ స్టార్టప్​లకు ప్రథమ వినియోగదారుగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ స్టార్టప్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జైయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

చాలా మంది ఔత్సాహిక మహిళలు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. భారత దేశంలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు మీ అందరికి తెలుసు. దేశంలో 50 మంది యువకులే ఉన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఇన్నోవేషన్స్​ చేయాలి. మనం కనిపెట్టినవి దేశానికే కాదు ప్రపంచానికి ఉపయోగపడతాయి.

-కేటీఆర్​, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి

KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం: కేటీఆర్​

ఇదీ చదవండి: MLA Rajagopal Reddy: 'ఈటలను ఓడించడానికే.. దళితబంధు పథకం'

సెకనులో 57వేల సినిమాలు డౌన్‌లోడ్‌!

polycet 2021: పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

Last Updated : Jul 28, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.