హైదరాబాద్ మాదాపూర్ ఓ ప్రైవేట్ హోటల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇమేజ్ తొలి సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి ప్రారంభించారు. గేమింగ్, వీఎఫ్ఎక్స్, ఏఐ, యానిమేషన్ రంగాల్లో చేయూత ఇవ్వడానికి ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం 30 అంకుర సంస్థలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఐదేళ్లలో మరిన్ని సదుపాయాల కల్పనకు 19కోట్ల 68 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అనంతరం జయేష్ రంజన్ సమక్షంలో పలు సంస్థలు ఏంఓయూలు కుదుర్చుకున్నారు.
ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!