ETV Bharat / state

రాజధానిలో గుంతల వేటకు సరికొత్త విధానం, మీరు కూడా భాగస్వాములు కావచ్చు - హైదరాబాద్​ గుంతలు కనుగోనేందుకు సరికొత్త విధానం

A new approach to road repairs ఇప్పటికే కృత్రిమ మేధస్సు​తో మంచి ఫలితాలు రాబట్టుతున్న తెలంగాణ ఐటీ శాఖ ఈసారి దాని సహాయంతో ఓ సరికొత్త ఛాలెంజ్​కి తెరతీసింది. నగరంలో రోడ్లపై గుంతులు గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు ఐటీ శాఖ ముందుకొచ్చింది. క్యాబ్​ జెమినితో కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జతకట్టింది. అంతే కాకుండా ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి తగు ప్రోత్సాహాకాలు ప్రకటించింది.

నగరంలో గుంతల వేటకు సరికొత్త విధానం
IT department
author img

By

Published : Aug 26, 2022, 6:58 PM IST

A new approach to road repairs: తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక చొరవతో చేపట్టిన తెలంగాణ ఏఐ మిషన్‌ ఓ కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించింది. నగరంలో ఉన్న గుంతలను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ద్వారా గుర్తించి వాటి తీవ్రతను తెలుసుకొని తగిన చర్యలు చేపట్టడం కోసం ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. జీహెచ్​ఎంసీ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంతో క్యాప్ జెమిని భాగస్వామిగా ఉండనుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి ధరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. ఆసక్తి ఉన్నవారు www.taim-gc.in/mobility వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే కాదు....దేశంలో ఉన్న ఆవిష్కర్తలందరూ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు. షార్ట్‌లిస్ట్‌ అయిన వారికి కాన్సెప్ట్‌ ప్రూఫ్‌ తయారు చేయటం కోసం నాలుగు వారాల గడువు ఇవ్వబడుతుంది.

ఛాలెంజ్‌లో గెలిచిన విజేతలకు 20లక్షల నగదు బహుమతిని నిశ్చయించింది. తెలంగాణ, హైదరాబాద్‌లను ప్రపంచ కృత్రిమ మేధాహబ్బుగా మార్చటానికే ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించినట్లు ఐటి శాఖ వెల్లడించింది. సామాజిక సమస్యలను తొలంగించేందుకు ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఐటి శాఖ ప్రదాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.