నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సును సమర్థంగా అందిస్తే.. విద్యార్థులు క్రాష్ కోర్సుల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పలు రకాల కోర్సుల కోసం టెక్నాలజికల్ కంపెనీలు, సంస్థలతో టాస్క్ రెండేళ్లకుగాను ఒప్పందం కుదుర్చుకుందని జయేష్ తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ సమక్షంలో పలు కంపెనీల ప్రతినిధులు టాస్క్ తో ఇందుకు సంబంధించి 20 కు పైగా ఎంవోయూలపై సంతకం చేశారు.
ఈ ఒప్పందాలతో 30 వేలకు పైగా తెలంగాణ విద్యార్థులకు నూతన సాంకేతికత, పద్ధతులపై అవగాహన పొందేందుకు లబ్ధి చేకూరుతుందని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తెలిపారు.