ETV Bharat / state

మిషన్ భగీరథ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: చాడ - Cpi News

మిషన్ భగీరథ పనులు చేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వారిని తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు.

మిషన్ భగీరథ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : చాడ

author img

By

Published : Jul 12, 2020, 7:53 PM IST

మిషన్ భగీరథ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్క్ ఇన్​స్పెక్టర్లు, సహాయ ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది మొత్తం 642 మంది 2019 నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని క్రమబద్ధీకరించాలని మిషన్ భగీరథ ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు.

ఫలితంగా పైప్​లైన్ లీకేజీలు, నిరంతరం తనిఖీలకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే సకాలంలో వేతనాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించాలని చాడ ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి : అర్వింద్​పై దాడి అనైతికం.. మూల్యం తప్పదు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.