ETV Bharat / state

ISIS Sympathizer Arrested: పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

ISIS Sympathizer Arrested: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్​నూమలో ఐసిస్ సానుభూతిపరుడిని సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తూ పోస్టులు పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ISIS
ISIS
author img

By

Published : Apr 2, 2022, 5:11 PM IST

Updated : Apr 2, 2022, 8:30 PM IST

ISIS Sympathizer Arrested: హైదరాబాద్ రాజధాని నగరంలో ఉగ్రవాద సంస్థ ఐసిస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా) కార్యకలాపాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ అబుసాని హైదరాబాద్‌ కేంద్రంగా కొద్దినెలల నుంచి ఐసిస్‌ సానుభూతిపరులను తయారు చేసేందుకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నాడు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన సైబర్‌క్రై పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలిసింది.

పథకం ప్రకారం: ఇరాక్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా యువతను ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టి జిహాద్‌ సైనికులుగా తయారు చేస్తున్న ఐసిస్‌ సంస్థ సభ్యులతో అబుసాని నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. సామాజిక మాధ్యమాలు, ప్రత్యేకంగా సృష్టించిన యాప్‌ల ద్వారా తన స్నేహితులు, సన్నిహితులను జిహాద్‌ వైపు మళ్లించేందుకు అవసరమైన సమాచారాన్ని, వీడియోలను వారికి పంపుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఐసిస్‌ సంస్థ నుంచి హవాలా ద్వారా నిధులు సేకరిస్తున్నాడని సమాచారం.

దేశంలో విధ్వంసాలకు కుట్ర: మహ్మద్‌ అబుసాని ఐసిస్‌ సానుభూతిపరుడన్న సమాచారంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తీవ్రత ఆధారంగా చట్టపరమైన చర్యలు చేపడతామని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. దేశంలోని మెట్రోనగరాలు, పట్టణాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రణాళికను సిద్ధం చేసిందని మహ్మద్‌ అబుసాని ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన పోలీసులు తెలుసుకున్నారు. ప్రార్థనా మందిరాలు, ఇతర ప్రాంతాలు, దేశంలోని వివిధ నగరాల్లో ఉంటున్న విదేశీ రాయబార కార్యాలయాలపై బాంబులతో దాడులు చేసేందుకు పథకం రచించినట్టు గుర్తించారు.

మహ్మద్‌ ఎప్పటి నుంచి ఐసిస్‌ సానుభూతిపరుడిగా మారాడు? అతడి కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు ఇతర విషయాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ తరఫున హైదరాబాద్‌లో కొందరు యువకులు గతంలోనూ పనిచేశారు. వీరిలో ఎనిమిది మందిని జాతీయ దర్యాప్తు సంస్థ నాలుగేళ్ల కిందట అరెస్ట్‌ చేసింది. మరో ఘటనలో 2018వ సంవత్సరంలో ఇద్దరు యువకులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: Pragathi bhavan ugadi celebrations: 'శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే'

Last Updated : Apr 2, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.