ETV Bharat / state

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో విచారణ కొనసాగుతుంది. సిట్​ దర్యాప్తు అధికారి సురేందర్​ రెడ్డిని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నిస్తోంది. రేపు ఎన్​కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల సాక్ష్యం తీసుకోనుంది.

investigation Ongoing on disha encounter case
దిశ నిందితుల ఎన్‌కౌంటర్
author img

By

Published : Sep 2, 2021, 1:37 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్‌రెడ్డిని కమిషన్ సభ్యులు విచారిస్తున్నారు. బుధవారం కూడా సురేందర్‌రెడ్డిని కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిట్ నివేదికలో పొందుపర్చిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

గత నెల 26, 27, 28 తేదీల్లోనూ సురేందర్‌రెడ్డిని కమిషన్ విచారించింది. ఇవాళ సురేందర్‌రెడ్డి విచారణ ముగిస్తే... మరో ఒకరిద్దరూ పోలీస్ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యాన్ని కమిషన్... శుక్రవారం నాడు సేకరించే అవకాశం ఉంది. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులకు కమిషన్ కార్యదర్శి నుంచి సమాచారం చేరవేశారు. కమిషన్ ఆదేశాలతో మృతుల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. గుండ్లపల్లి, జక్లేర్‌లో వాళ్ల ఇళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ వెంట ఉండి.. మృతుల కుటుంబ సభ్యులను రేపు కమిషన్ వద్దకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: CJI Justice NV Ramana: 'దిశ' కేసులో విచారణను ఎందుకు సాగదీస్తున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.