తితిదే చరిత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొలిసారి ఏకాంతంగా జరగనున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఆలయ ప్రాకారంలోనే సాగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని తితిదే తీసుకున్న నిర్ణయంతో బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా సాగనున్నాయి. ఆలయ ప్రాకారంలోని సంపంగి మండపంలో వాహన సేవలను నిర్వహించనున్నారు.
వైఖానస ఆగమశాస్త్రం మేరకు వైదిక కార్యక్రమాలకు లోటు లేకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. విమానప్రాకారంలో ప్రదక్షిణలు, సంపంగి మండపంలో వాహనంపై శ్రీవారు కోలువుతీరడం వంటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ వాహన సేవలు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలపై ఈటీవీ భారత్ తో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మరిన్ని వివరాలు పంచుకున్నారు.
ఇదీ చదవండి: 'అంతర్వేది ఘటన తర్వాత అప్రమత్తమైన తితిదే అధికారులు'