అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా రాజకీయ వ్యూహాలను అమలు చేశారని ప్రవాస భారతీయుడు శివకుమార్ శర్మ అన్నారు. వ్యాపారవేత్తగా పేరున్న ట్రంప్... ఈ విషయంలో వెనకబడ్డారని విశ్లేషించారు. బైడెన్ గెలవటంతో విధానపరంగా పెద్ద మార్పులు రాకపోవచ్చని తెలిపారు. పన్నులు పెంచే అవకాశం ఉందని వివరించారు. ఈ ఎన్నికల్లో సాధారణ పౌరులు, చిన్న ఉద్యోగులు డెమోక్రట్ పార్టీని ఎక్కువగా బలపరిచారని చెప్పుకొచ్చారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో భారత్కు వచ్చిన సమస్య ఏం లేదని... దౌత్య సంబంధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈటీవీ భారత్ తో ముఖాముఖిలో మాట్లాడిన ఆయన... అమెరికా ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి, ఇమిగ్రేషన్ పాలసీ, భారత్-అమెరికా సంబంధాలపై చైనా ప్రభావం వంటి అంశాలపై అభిప్రాయలను పంచుకున్నారు.
ఇదీ చదవండి: బైడెన్ గెలుపుతో ఊపిరిపీల్చుకున్న చైనా..!