ETV Bharat / state

'నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదు' - doctors about RT-PCR tests latest

వైద్యులు, ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలను పాటిస్తూనే... ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ చెబుతున్నారు. ప్రస్తుతం కరోనాకు కచ్చితమైన ఔషధమేమీ రాలేదని.... వెంటిలేటర్‌పై ఉన్నవారికి మాత్రం డెక్సా మిథసోన్‌ను వినియోగిస్తున్నారని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదంటున్న డాక్టర్‌ రమేష్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్‌.

interview
'నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదు'
author img

By

Published : Jul 1, 2020, 9:34 AM IST

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాల్లో కాస్త గందరగోళం ఉందని...నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన అశ్రద్ధ తగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీస్‌ పరీక్షలు ఆర్టీపీసీఆర్‌కు ప్రత్యామ్నాయం కాదనంటున్నారు. ప్రస్తుతం కరోనాకు కచ్చితమైన ఔషధమేమీ రాలేదని చెబుతున్నారు.

ప్రాణాలు రక్షించే మందు ప్రస్తుతం డెక్సామిథాసోన్‌ మాత్రమేనని...క్రిటికల్‌గా లేనివారికి డెక్సామిథాసోన్‌ ఇవ్వడమూ మంచిది కాదని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా.రమేష్‌ తెలిపారు. ఏ ఉష్ణోగ్రతలో అయినా వైరస్‌ విజృంభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వేడినీళ్లు తరచుగా తాగితే వైరస్‌ రాదన్నది అబద్ధమని... ఎక్కువ తాగితే మ్యూకస్‌ మెంబ్రేన్ దెబ్బతినే ప్రమాదముందని డాక్టర్ రమేష్‌ చెప్పారు.

'నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదు'

ఇవీచూడండి: రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.