మే 12న రవీంద్రభారతిలో జరిగే ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొంటారని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను రాథోడ్, వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రూడవత్, అసోసియేషన్ సభ్యులు తెలిపారు. భారీ సంఖ్యలో నర్సులు హాజరవ్వాలని కోరారు.
"ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న నర్సింగ్ విభాగానికి శుభాకాంక్షలు. ప్రజారోగ్యంలో నర్సులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. వారు ఎనలేని సేవ చేస్తున్నారు."
- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి
ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్‌కు తగిన ప్రోత్సహం, ప్రభుత్వ పరంగా అందవలసిన న్యాయమైన హక్కుల కోసం నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పోరాడుతోందని లక్ష్మణ్ రూడవత్ తెలిపారు. వారి సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులను మంత్రి ఈటల చేతుల మీదుగా ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని లక్ష్మణ్ రూడవత్ అన్నారు.
ఇదీ చూడండి: డాజిల్ స్పోర్ట్స్ వేర్ ఎలా వచ్చిందంటే..?