'భవిష్యత్తులో వారం రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్' సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా తెలంగాణ సాంస్కృతిక శాఖ.. ఐదో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 13,14,15 తేదిల్లో నిర్వహించే ఈ వేడుక ఏర్పాట్లను సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులతో కలిసి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ వేడుకలో పది దేశాలతో పాటు మన దేశంలోని 25 రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని బుర్రా వెంకటేశం తెలిపారు.
ఈ సంవత్సరం కైట్, స్వీట్ ఫెస్టివల్స్‌తో పాటు స్నాక్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని వెంకటేశం ప్రకటించారు. భవిష్యత్తులో ఈ వేడుకను మూడు రోజుల నుంచి వారం పాటు నిర్వహిస్తామన్నారు. జింఖానా మైదానంలో క్రీడా విభాగం ఆధ్వర్యంలో పురాతన, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలు ప్రతిబింబించే ఆటలను నిర్వహిస్తామని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..