అనాథ పిల్లల్లో అనారోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఛాయిస్ ఫౌండేషన్‌తో కలిసి వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్, నారాయణఖేడ్, అచ్చంపేట, మెదక్, జనగామ, గజ్వేల్, సిద్ధిపేట జిల్లాల్లోని 24 అనాథ శరణాలయాల్లో చిన్నారులకు పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతిచిన్నారికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆయా వివరాల్ని డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 946 మంది చిన్నారుల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఛాయిస్ ఫౌండేషన్ సేకరించింది. వీరిలో ఎక్కువ మందికి పౌష్టికాహార లోపం, విటమిన్, దృష్టి, వినికిడి లోపాలు, మానసిక, దంత సమస్యలు ఉన్నాయని, ఎక్కువ మంది అంతర్గత ఆరోగ్య సమస్యలకు దగ్గర్లో ఉన్నారని వెల్లడైంది. అనాథ చిన్నారుల్లో 12 మందికి ఎక్సోమ్ సీక్వెన్సింగ్, జెనెటిక్ స్టడీస్ అవసరమని ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది. 128 మంది చిన్నారులకు ఎంఆర్‌ఐ, సీటీస్కానింగ్ చేయాలని పేర్కొంది.
![](https://assets.eenadu.net/article_img/270622gh-main10b.jpg)
మరో రెండున్నర నెలల్లో పూర్తి
- డాక్టర్ సతీష్ ఘంటా, డైరెక్టర్, ఛాయిస్ ఫౌండేషన్‌జ
రాష్ట్రంలోని అనాథ పిల్లలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల ఆరోగ్య సమస్యల్ని అధ్యయనం చేస్తున్నాం. అనాథ పిల్లల్లో 185 మంది చిన్నారులకు అవసరమైన వైద్య చికిత్సను ఫౌండేషన్ అందిస్తోంది. వీరిలో ఒకటికన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలున్నవారున్నారు.
ఇవీ చదవండి: