ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి ప్రకటించనున్నారు. మూల్యాంకనం, మార్కుల అప్లోడ్, ఇతర ఫలితాల ప్రక్రియ పూర్తయిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఫలితాల ప్రక్రియను మరోసారి తనిఖీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలపై బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నటు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇవీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్