ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆలస్య రుసుము గడువు నేటితో ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 65వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల్లో 97.93 శాతం మంది ఫీజు చెల్లించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,317 కేంద్రాలు... ప్రాక్టికల్స్ కోసం 1,517 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇవీచూడండి: సమత కేసు విచారణ రేపటికి వాయిదా