ప్రవేశాలు దక్కేనా....?
సప్లిమెంటరీ పరీక్షలు రాసిన వారిలో కొందరు ఐఐటీ, ఎన్ఐటీల్లో కూడా ప్రవేశాలు సాధించారు. ఈ నెల 15 లోగా ఇంటర్ ధ్రువపత్రాలు సమర్పించక పోతే... సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంజినీరింగ్, ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదటి విడత ఇప్పటికే పూరైంది. సప్లిమెంటరీ ఫలితాలు రాకపోవటం వల్ల... ఆ విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించలేకపోతున్నారు. మరోవైపు డిగ్రీ ప్రవేశాలకు మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహించేందుకు దోస్త్ అధికారులు సిద్ధంగా ఉన్నా.... సప్లిమెంటరీ ఫలితాలు మాత్రం విడుదలకాలేదు.
విద్యార్థుల్లో ఆందోళన...
ఫలితాల్లో జాప్యం వల్ల ఇప్పటికే ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం కోల్పోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పటిలోగా ఫలితాలు వెల్లడిస్తారనేది అధికారులు స్పష్టం చేయకపోవటం అందరినీ అసహనానికి గురిచేస్తోంది.
ఇంకెప్పుడు సారూ....?
ఫలితాల్లో జాప్యం వల్ల విద్యార్థులు నిట్, ఐఐటీల్లో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌పై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. విద్యా శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి... సమస్య పరిష్కరంపై శ్రద్ధ చూపాలని కోరతానన్నారు. కనీసం ఈ రెండు రోజుల్లోనైనా ఫలితాలు ప్రకటిస్తారేమోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు