Inter Hall Tickets: ఈనెల 6 నుంచి జరగనున్న పరీక్షల కోసం... ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1443 పరీక్ష కేంద్రాలు... 25వేల మంది ఇన్విజిలేటర్లను అధికారులు సిద్ధం చేశారు. ప్రతి ఏడాది హాల్ టికెట్లను కళాశాలలకు పంపించినరోజునే.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారు. అయితే ఈ ఏడాది కాలేజీలకు వారం క్రితమే పంపించారు. కానీ హాల్ టికెట్లు ఇచ్చేందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. ఎట్టకేలకు స్పందించిన ఇంటర్ బోర్డు ఎప్పటిలాగే హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఫిర్యాదుల మేరకు రెండు కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు... టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. 24 గంటల పాటు.. కౌన్సిలర్స్ అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. పరీక్షల అనంతరం ఉచితంగా ఎంసెట్, జేఈఈ, నీట్ కోసం... విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమయ్యింది.
ఇవీ చదవండి: