రాష్ట్రంలో ఇంటర్మీడియట్(Intermediate) మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును(inter admissions 2021) మళ్లీ పొడగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు ఈనెల 30 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ గడువు ఆగస్టు 30 వరకు ఉండగా... దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. తాజాగా మరో 15 రోజుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది. ఐదారేళ్లుగా ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకీ ప్రవేశాల సంఖ్య(inter admissions in telangana) పెరుగుతుండటంతో సెప్టెంబరు 30వరకు ఇంటర్ బోర్డు ప్రవేశాల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Saidabad rape case: 'సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'