Intermediate Practical Exams: ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వార్షిక పరీక్షలు కూడా యథాతథంగా కొనసాగుతాయని.. విద్యార్థులు ఎలాంటి అయోమయానికి గురికావద్దని ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రత్యక్ష తరగతులు కొనసాగుతాయని బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
గత విద్యాసంసవత్సరంలో కేవలం 45 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగినందున.. ప్రాక్టికల్స్ నిర్వహించకుండా మార్కులు వేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఆన్లైన్ తరగతులు ప్రారంభించడంతో పాటు.. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన కూడా జరుగుతోందని జలీల్ తెలిపారు. ఒమిక్రాన్ ప్రభావంతో కేవలం 14 రోజులు కాలేజీలు మూతపడ్డాయని... ఈనెల 1 నుంచి తరగతులు జరుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రాక్టికల్స్ పరీక్షలు ఎప్పటిలాగే వార్షిక పరీక్షలకు ముందే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: