ETV Bharat / state

పరీక్ష కేంద్రాలను పెంచేందుకు ఇంటర్​ బోర్డు నిర్ణయం - Inter-Board latest news

పరీక్షల కోసం ఇంటర్​ బోర్డు కసరత్తులు ప్రారంభించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్ష కేంద్రాలను పెంచేందుకు నిర్ణయించింది. మరో 600 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనుంది.

Inter-Board decision to increase exam test centers
పరీక్ష కేంద్రాలను పెంచేందుకు ఇంటర్​ బోర్డు నిర్ణయం
author img

By

Published : Mar 15, 2021, 10:27 PM IST

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను భారీగా పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 600 పరీక్ష కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. కరోనా పరిస్థితుల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

మే 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,369 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అదనంగా 600 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. జూనియర్ కాలేజీలు సరిపోనందున సుమారు 200 పాఠశాలలు, మరో 200 డిగ్రీ కాలేజీలనూ పరీక్ష కేంద్రాల కోసం ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: 'మిథానిలో కేంద్ర వాటా తగ్గింపునకు ప్రయత్నిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.