సాధారణ, జీవితబీమా, ఆరోగ్య బీమా సంస్థలన్నీ నూతన నిబంధనలను 2020 అక్టోబరు 1 నుంచి తప్పకుండా అనుసరించాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. ఆయా వ్యాధులు ఉన్న వారితో ఎలా వ్యవహరిస్తామనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలియాల్సి ఉందని వివరించింది. ఆరోగ్యవంతులతో పాటు వ్యాధులున్న వారికి నిబంధనలు ఎలా వర్తిస్తాయో తెలపాలని కోరింది.
2017 నాటి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ నియంత్రణ చట్టం, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం నిబంధనలూ పాటించాలని సూచించింది. ఈ ఏడాది జులై 31 నాటికి బీమా సంస్థలన్నీ లీగల్ ఎంటిటీ ఐడెండిఫైయర్ స్మృతి అమలు చేయాలని కోరింది. ఆర్థిక డేటాలో నాణ్యత, కచ్చితత్వానికి ఇది కీలకం అవుతుంది.