విజయవాడ దుర్గ గుడిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ శానిటరీ టెండర్ల అవకతవకలపై ఇప్పటికే అందిన ఫిర్యాదులకు సంబంధించి.. ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డి కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయ ఈవో నుంచి వివరాలు సేకరిస్తున్నారు. స్టోర్స్ చీరల విభాగం, అన్నదాన విభాగంలో దస్త్రాలను పరిశీలిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో ఇప్పటికే 15 మంది అధికారులు సస్పెండైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రేపటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్