Innovation Expo in Hyderabad : రోజు రోజుకు ప్రపంచంలో పెరుగుతున్న సాంకేతికతలను, ఆవిష్కరణలను ఒక దగ్గర చేరుస్తూ దేశ నలుమూలల ఉన్న చిరు వ్యాపారులను, అంకురాలను ప్రోత్సాహిస్తూ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఎఫ్‌టీసీసీఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోను ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో దేశ నలుమూలల నుంచి వచ్చిన అంకుర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా....టీఎస్‌ఐఐసిీ ఎండీ ఈ.వి.నరసింహా రెడ్డి, ఐఎఫ్‌ఎస్ ఈ విష్ణు వర్థన్ రెడ్డి, ఐసీఏఆర్ సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి, టి హబ్ సిఈఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన అంకురాలు పాల్గొంటున్నాయి.
Startups in Telangana : హైదరాబాద్ హైటెక్స్‌లో ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీయల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో సందర్శకులను ఆకట్టుకుంటోంది. దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలను పారిశ్రామిక రంగానికి చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది. ఎక్స్‌పోకి దేశం నలుమూలలనుంచి వచ్చిన అంకురాలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టాయి. పారిశ్రామిక ప్రగతిని వేగవంతంచేసే సాంకేతికపరిజ్ఞానం, వాటి ఉపకరణాలు పరిచయం చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ-ఎఫ్‌టీసీసీఐ తొలిసారి హైటెక్స్‌లో.. సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసింది.
'రాష్ట్రంలో అన్ని రంగాల్లో 9 సంవత్సరాల కాలంలోనే 90 సంవత్సరాల అభివృద్ధి జరిగిందంటేకేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లే. ముఖ్యంగా ఇండస్ట్రీస్ తెలంగాణలో, హైదరాబాద్‌లో విస్తరించడానికి కారణం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్, నీళ్ల కొరత చూస్తున్నాం. రాష్ట్రంలో యువత ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. సీఎం ఇరిగేషన్ పైన పెట్టిన శ్రద్ధ వల్ల భారత దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ముందుంది. '- జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
Industrial Innovation Technology Expo in Hyderabad : ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శనను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రారభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆంకుర సంస్థల ప్రతినిధులు. తమ ఉత్పత్తులు పరిచయం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. సరికొత్త ఆవిష్కరణల సహకారంతో సాంకేతిక అభివృద్ధిపై పట్టు సాధించేందుకు పరిశ్రమలు... ఈ ప్రదర్శనను ఉపయోగించుకోవాలని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ కోరారు.
వివిధ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసేందుకు ఈ ఎక్స్ పో ఏర్పాటు చేశాం. మధ్యతరహా, పారిశ్రామిక రంగాలు రంగాలు తమ పనితీరు ఆధునీకరించుకునేందుకు ఈ ఎక్స్‌పో ఎంతగానో ఉపయోగపడుతుంది. వియత్నాం నుంచి వచ్చిన 14 మంది సభ్యుల బృందం ప్రదర్శనను సందర్శించనుంది. 100కు పైగా బీ టు బీ సమావేశాలు నిర్వహించాలని వారి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.' - అనిల్ అగర్వాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు
మూడ్రోజులపాటు జరగనున్న కార్యక్రమంలో 150కు పైగా అంకుర సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. తొలిరోజు సాంకేతిక, తయారీ రంగాల సంస్థలు తయారు చేసిన...... బ్యాటరీ సైకిళ్లు, డిజిటల్ ఉపకరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తులు, తినుబండారాల గురించి అంకురాల ప్రతినిధులు వివరించారు..
ఇవీ చదవండి: