Revanth Reddy Latest News : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని ఆయన హర్షించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుమ్మరి ఎల్లవ్వకు నిర్మించిన.. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
Revanth Reddy Fires On BRS : ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో గతంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎల్లవ్వ ఇంటిని చూశాను.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లడానికి మంచి దారి వేసుకున్నారని.. కానీ రోడ్డు పక్కనే ఉన్న ఎల్లవ్వ ఇంటిని ముంచేశారని విమర్శించారు. ఈ క్రమంలో రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్‌కు చెప్పినా.. పట్టించుకోలేదని తెలిపారు. ఇక్కడి బీఆర్‌ఎస్ నాయకులకు భూ కబ్జాలు తప్ప పేదల బాధలు పట్టవని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులతో చెప్పి.. ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించామని తెలిపారు.
- Revanth Reddy Fires on BJP : 'కాంగ్రెస్‌లో కోవర్టులెవరూ లేరు.. ఎవరి మధ్య విభేదాలు లేవు'
- Revanth Reddy Comments on CM KCR : 'మేం గెలిస్తే.. తెలంగాణలోనూ మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ'
అందుకు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్, మల్లారెడ్డికు సవాల్ విసిరారు. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే తాము ఓట్లు అడుగుతాం.. మీరు ఎక్కడెక్కడ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టారో అక్కడ ఓట్లు అడగండని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్లు రావని.. అయినా మీకు డిపాజిట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులం గుండు కొట్టించుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని అన్నారు.
Revanth Reddy Challenged KCR And Mallareddy : అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తామని మాట ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి.. కచ్చితంగా రైతులను ఆదుకుంటామని వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మహిళలను ఆదుకునేందుకు రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి :