వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజనామా చేసినట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా లేఖను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
ప్రజా జీవితంలోనే ఉంటానని... అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం పని చేస్తానని అన్నారు. యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం... దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మైనారిటీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం పోరాడుతునే ఉంటానని ప్రకటించారు. వీటి కోసమే పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు.
వైతెపాకు నేను రాజీనామా చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచి... ప్రోత్సాహించిన పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తాను.
-ఇందిరా శోభన్
ఇదీ చదవండి: Varalakshmi Vratam: ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో మహిళల వ్రతాలు