శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ, ముంబయి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు దాదాపు నాలుగు గంటలు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గోవాతో పాటు మరికొన్ని విమానాలను అధికారులు క్యాన్సిల్ చేశారు. అయితే విమానాల ఆలస్యంపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.
ఇదీ చూడండి : నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం