ETV Bharat / state

పైలెట్​ అప్రమత్తతతో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు - హైదరాబాద్​ ఇండిగో విమానం

శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్​- దిల్లీ ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. విమానం రన్​వేపై వెళ్తుండగా ఇంజిన్​లో​ సాంకేతిక సమస్యను పైలెట్​ గుర్తించాడు. సమస్యతో ​ రన్​వేపై నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

ఇండిగో విమానం
author img

By

Published : Jul 23, 2019, 8:53 AM IST

Updated : Jul 23, 2019, 2:31 PM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌-దిల్లీ ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ఉదయం 6.50 గంటలకు బయల్దేరాల్సిన విమానం 7.20 గంటలకు బయలుదేరుతుందని సిబ్బంది బోర్డింగ్​ పూర్తి చేశారు. విమానం రన్​వేపై వెళ్తుండగా పైలెట్​ ఇంజిన్​లో సాంకేతిక సమస్యను గుర్తించాడు. అప్రమత్తమై విమానాన్ని నిలిపేశాడు. ఆ సమయంలో దాదాపు 156 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. సుమారు 2 గంటల వరకు విమానం రన్​వే పైనే నిలిచిపోయింది. అధికారులు ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు.

samshabad airport

ఇదీ చూడండి : ముంబయి అగ్నిప్రమాదంలో అందరూ సురక్షితం

Last Updated : Jul 23, 2019, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.