రాష్ట్రానికి భారతీయ రైల్వే (Indian Railway) ఇప్పటి వరకు 2 వేల 26 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిందని రైల్వేశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజన్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైల్వేశాఖ తెలిపింది.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు 2 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో 113 ట్యాంకర్లతో వైద్య ఆక్సిజన్‌ను పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశా నుంచి 16 రైళ్లు, ఝార్ఖండ్ నుంచి 4 రైళ్లు, గుజరాత్ నుంచి 2 రైళ్లలో ఆక్సిజన్ తీసుకొచ్చినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గమ్య స్థానాలకు వేగంగా చేరుకునేలా రైల్వే శాఖ గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసిందని వివరించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చుడండి: ఇంటి అద్దె చట్టానికి కేబినెట్ ఓకే- కీలకాంశాలు ఇవే...