ఫొటోగ్రఫీ ఒక హాబీగా తీసుకోవాలని... కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో సైతం అనేక మార్పులు వచ్చాయని ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్, ఫిలిజర్ అవార్డు గ్రహీత కారల్ గుజయ్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్గ్యాలరీలో ఈనెల 19 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించనున్న ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో భాగంగా నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్స్‌తో ఆమె ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తన జీవితంలో ఎదురైన సమస్యలతో పాటు వారి అనుభావాలను ఫొటోగ్రాఫర్స్‌తో ఆమె పంచుకున్నారు. సృజనాత్మకత, ఆధునిక పరిజ్ఞానం మేళవింపే ఫోటోగ్రఫీ అని కారల్ తెలిపారు.
ఇదీ చూడండి: న్యూజెర్సీతో సిస్టర్ స్టేట్ పార్టనర్షిప్ ఒప్పందం