పుస్తకాలు కొనలేని, చదవలేని ప్రాంతం నుంచి వచ్చి.. పుస్తకాల్లో నిలిచే స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ అని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లో ఎవరెస్టు అధిరోహకురాలు పూర్ణ జీవితంపై రచించిన 'పూర్ణ' పుస్తకాన్ని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ హడ్డాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఎవరెస్టు అధిరోహణలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వెన్నుతట్టి ప్రోత్సహించిన వారందరి గురించి ఈ పస్తకంలో రచయిత్రి అపర్ణ తోట ప్రస్తావించారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పుస్తక రచన తనను మరింత నేలపై నడిచేలా చేసిందని రచయిత్రి అపర్ణ ఆనందం వ్యక్తం చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తన తల్లిదండ్రులు రావాలని ఉన్నా...రాలేకపోయారని పూర్ణ స్వల్ప భావోద్వేగానికి లోనయ్యారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో వర్షం.. రోడ్లన్నీ జలమయం