హైదరాబాద్ ప్రపంచంలోనే గొప్ప హెల్త్‌హబ్‌గా మారుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు సంబంధించిన రోగులు నగరానికి వచ్చి అతి చవక ధరల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రముఖ మెడికల్ డివైస్ టెక్నాలజీ సంస్థ మిండ్రే ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా, చైనా హెల్త్‌కేర్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి నిర్వహణ, సాంకేతికత, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం వంటి అంశాలపై వైద్యులు చర్చించారు. సుల్తాన్‌పూర్ ప్రాంతంలో హెల్త్ డివైస్ పార్కును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇవీ చూడండి: 'రెవెన్యూ సంస్కరణలతో పాలన ప్రజలకు చేరువైంది'