ETV Bharat / state

మానవ తప్పిదమా లేదా షార్ట్‌సర్క్యూటా.. అసలేం జరిగింది? - శ్రీశైలం జల విద్యుత్​ కేంద్ర ప్రమాదం తాజా వార్తలు

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం మానవ తప్పిదమా లేదా షార్ట్‌సర్క్యూటా అన్న అంశంపై సీఐడీ దృష్టి సారించింది. మంటలు ఎక్కడి నుంచి ఎలా మొదలయ్యాయనే కోణంలో లోతుగా విచారణ జరిపి సంఘటనా స్థలం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించింది.

Indepth investigation into the fire at Srisailam Hydroelectric Power Station
మానవ తప్పిదమా లేదా షార్ట్‌సర్క్యూటా.. అసలేం జరిగింది?
author img

By

Published : Aug 24, 2020, 9:41 AM IST

ప్రమాదం జరిగిన రెండోరోజు వినాయక చవితి పండగ నాడే సీఐడీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్లాంటు లోపలికెళ్లి అణువణువూ పరిశీలించారు. శని, ఆదివారాల్లో సిబ్బందిని అన్ని కోణాల్లో ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు విద్యుదుత్పత్తి ఎలా ఉంది? ఎప్పుడు నిలిపివేశారనే వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో దగ్ధమైన కేబుల్‌, ప్యానల్‌ బోర్డులను సీజ్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా అయ్యే తీగలనూ పరిశీలించారు.

8అధికారులతో సమావేశం

శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న సీఐడీ డీజీ గోవింద్‌సింగ్‌, డీఐజీ సుమతి, ఇతర అధికారులు పవర్‌హౌస్‌లోకి వెళ్లి.. అక్కడ మంటలు చెలరేగిన ప్యానల్‌ బోర్డులను పరిశీలించారు. జెన్‌కో సంచాలకులు వెంకటరాజం, సచ్చిదానందం, అజయ్‌, చీఫ్‌ ఇంజినీర్లు (సీఈలు) సురేశ్‌, ప్రభాకర్‌, ఇన్‌ఛార్జి సీఈ ఉమామహేశ్వరచారి, ఎస్‌ఈ హన్మాన్‌, డీఈలు, ఏఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరిగాయా.. జరిగితే అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన అధికారులు, సిబ్బందిని కలిసి ప్రమాదం తీరును, వారు తప్పించుకుని బయటపడిన తీరును ఆరా తీశారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని విడివిడిగా విచారించారు.

8విడివిడిగా విచారణ

ఆదివారం ఉదయం నుంచి సీఐడీ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. ఒక బృందం జెన్‌కో సిబ్బందిని కృష్ణవేణి వసతిగృహంలో విడివిడిగా విచారించింది. మరో బృందం ప్లాంటును పరిశీలించింది. ప్రమాదం జరిగిన రోజు ఎంతమంది విధులకు హాజరయ్యారు? ఎవరు ఎప్పుడు బయటకెళ్లారు? ఆ సమయంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం సభ్యులు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. వీరితో పాటు జెన్‌కోకు చెందిన విజిలెన్సు బృందమూ తనిఖీలు నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.