ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా నీరు రావటంతో పోలవరంలోని 19 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికే భద్రాచలం, ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వాడపల్లి, కొత్తూరు గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంది. పోలవరం వద్ద వరద నీరు 24.50 మీటర్లకు చేరుకుంది. కడెమ్మ వంతెన పైకి నీరు చేరుకోవటంతో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గం పూర్తిగా వరదతో నిండిపోయింది. పాత పోలవరంలో... గట్టు కోతకు గురవ్వడం వల్ల ప్రజలు భయంతో వణికి పోతున్నారు. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం, లచ్చి గూడెం, బెస్త గూడెం, తదితర గ్రామాల చుట్టూ వరద నీరు చేరుకుంది. రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు పడవలపైనే ప్రయాణిస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశముందని కేంద్ర జలసంఘం అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:పోటెత్తుతున్న గోదావరి... లంక వాసుల్లో అలజడి